8 May, 2026 | 5:20 AM

షాదీ.కామ్ గెలుపు కహానీ..సీఈవో మాటల్లో

31-08-2024 03:11 PM

సీఈవో అనుపమ్ మిట్టల్ తన జీవితానుభవాలను  లింక్డిన్ వేదికగా  పంచుకున్నారు. 20 ఏళ్ల లోనే కోటీశ్వరుడినయ్యా. మైక్రో స్ట్రాటజీలో ప్రాడక్ట్ మేనేజర్ గా  ఉన్న సమయంలో కంపెనీ 40 బిలియన్ల డాలర్ల కు చేరుకుంది. దీంతో డబ్బులు బాగా  సంపాదించా. ఫెరారీని కూడా ఆర్డర్ చేశా. కొంత కాలానికి నా కథ అడ్డం తిరిగింది. డాట్ కామ్ బబుల్ సమయంలో అన్నింటినీ కోల్పోయా. 2003 నాటికి కేవలం గెలుపు, ఓటమిల అనుభవాలు మాత్రమే మిగిలాయి.. అక్కడినుంచి పట్టుదల తో  నా భవిష్యత్తు ప్రణాళిక వైపు అడుగులు వేశా.. షాదీ.కామ్ వెంచర్ మొదలెట్టా. దీని డొమైన్ ధర  25 వేల డాలర్లు.. 30 వేల డాలర్లు  మాత్రమే  మిగిలింది. దీంతో అందరూ  ఎగతాళి చేశారు కానీ చివరకు విజేత గా నిలిచాను. షాదీ.కామ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చాను అని అనుపమ్ వివిరించారు.