03-10-2024 01:12:31 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని టీఎన్జీవోస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం ఘనం గా నిర్వహించారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు టీఎన్జీవోస్ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌ఎం హుస్సేని(ముజీబ్) పూలమాల వేసి నివాళులర్పించారు.
బాపూజీ చూపిన అహింస బాటలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని, జీవితంలో అహింసా మార్గం ఒకటే విజయ కేతనం చూపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విక్రమ్‌కుమార్, సభ్యులు బాలరాజు, కేఆర్ రాజ్‌కుమార్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, వైదిక శాస్త్ర, నరేశ్ కుమార్, ఖాళీద్ అహ్మద్, మహమ్మద్ జహంగీర్ అలీ, మహమ్మద్ వహీద్ తదితరులు పాల్గొన్నారు.