calender_icon.png 22 January, 2026 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభకార్యాల్లో మద్యం ముట్టం

03-10-2024 01:13:37 AM

  1. హైదర్‌గూడ గ్రామస్థుల నిర్ణయం
  2. గాంధీ జయంతి సందర్భంగా తీర్మానం, ప్రతిజ్ఞ

రాజేంద్రనగర్, అక్టోబర్ 2: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్‌కు చెందిన హైదర్‌గూడ గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా హైదర్‌గూడ చౌరస్తాలో మహాత్ముడి విగ్రహానికి నివాళి అర్పించిన అనం తరం ఇకపై శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఇతర దావత్‌లలో మద్యం ముట్టబోమని తీర్మా నం చేసి ప్రతిజ్ఞ చేశారు.

మద్యం తాగడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, యువతపై తీవ్ర ప్రభావం పడుతుం దని వారు పేర్కొన్నారు. శుభకార్యాల్లో మం దు బంద్ కార్యక్రమం తమ నుంచి ప్రారం భం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మ్యాడం మధు, మోండ్ర కొమురయ్య, కొలను సుభాశ్‌రెడ్డ్డి, నాగగూడెం మల్లారెడ్డి, కార్పొరేటర్ సంగీత, వనం నర్సింహ, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.