calender_icon.png 17 December, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

17-12-2025 04:35:50 PM

- ఎన్నికల కోడ్ అమలులోనే ఉంది

- మంచిర్యాల డీసీపీ భాస్కర్

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా అమల్లోనే కొనసాగుతుందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. బుధ వారం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ విధమైన విజయోత్సవాలు, ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు, డీజే కార్యక్రమాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా  ఉండడానికి ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ నాయకులు సహకారం అందించాలని కోరారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ...

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలో బుధ వారం జరిగిన మూడో విడత పోలింగ్ సరళిని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పరిశీలించారు. జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని భీమారం, ఇందారం, జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి, బందోబస్త్ పై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎటువంటి అంతరాయం లేకుండా శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.