17-12-2025 05:42:56 PM
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, చింతకుంట్ల వెంకన్న
తుంగతుర్తి (విజయక్రాంతి): ఎంతోమంది పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో గల మహాత్మా గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడం ఆలోచనను విరమించుకోవాలని తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా సత్యాగ్రహం, అహింసా పద్ధతులలో బ్రిటిష్ వారితో పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుని పేరును తొలగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు, దేశం నుండి. బ్రిటిష్ వారిని ప్రారదోలి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుని పేరును కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆ మహాత్మ గాంధీ పేరు లేకుండా మార్పు చేయడం ఆయనను అవమానపరచడమే అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును యధావిధిగా అదే పేరుతో అమలు చేయాలని డిమాండ్ చేశారు.