21 August, 2026 | 3:40 AM

మంథనిలో రైస్ మిల్లుపై మిల్లులో విజిలెన్స్ తనిఖీలు

21-08-2026 12:00 AM

రూ.8.60 కోట్ల బకాయిలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు సూర్యాప

మంథని, ఆగస్టు20(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మి పారా బాయిల్ రా రైస్ మిల్లులో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 202223 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాక్షన్ పాడి బకాయిల కింద ప్రభుత్వానికి మిల్లు యజమాని రూ.8.60 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు గుర్తించా రు.

బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాలని విజిలెన్స్ అధికారులు సూచించడంతో మిల్లు యజమాని వెంటనే రూ.50 లక్షలకు చెక్కును అందజేశారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా మిగిలిన మొత్తం బకాయిలను కూడా చెల్లిస్తానని అధికారులకు హామీ ఇచ్చారు.ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సీతారెడ్డి, సీఐలు అనిల్కుమార్, వరుణ్కుమార్, తహసీల్దార్ దినేష్చంద్ర, సివిల్ సప్లై డీటీ పోచయ్య, ఎఫ్‌ఐ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.