20-01-2026 12:14:02 AM
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, జనవరి 19 (విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షలను పత్రిక ద్వారా బాహ్య ప్రపంచానికి చాటుతూ పత్రికా రంగంలో విజయక్రాంతి దినపత్రిక నూతన ఒరవడిని సృష్టిస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. విజయక్రాంతి పత్రికా ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి రిపోర్టర్ కుంభం రమేష్, మాజీ ఎంపీపీ కళింగ రాజు, బీ ఆర్ ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు ఉల్లెంగుల సందీప్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.