16-01-2026 01:24:27 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పతంగుల పండగను ఘనంగా నిర్వహించారు. గురువారం ఆసిఫాబాద్ పట్టణలోని స్థానిక హోలీట్రినిటీ ఉన్నత పాఠశాలలో సంక్రాతి పండగను పురస్కరించుకొని పతంగుల పండగను నిర్వహించారు. ఈ సందర్బంగా క్లబ్ అధ్యక్షాకార్యదర్శులు ఉదయబాబు, శ్రీనివాస్ లు కలిసి 100 మంది చిన్నారులకు పంతంగులు, దారం రీళ్ళు అందజేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్ అంతర్జాతీయ సభ్యులు ఏకిరాల శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వాసవి ఆలయ కమిటి అధ్యక్షుడు రావుల శంకర్, క్లబ్ కోశాధికారి శ్రీధర్, మాజీ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, శంకర్, వేణుగోపాల్, సభ్యులు రవీందర్, ప్రశాంత్, కృపాల్, జగదీష్, నితిన్, శ్రీనివాస్,నీలేష్, అమూల్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.