calender_icon.png 16 January, 2026 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహ జ్యోతిని పిల్లల చదువులకు ఉపయోగించుకోండి

16-01-2026 01:29:26 PM

ఖమ్మంపల్లి లో ప్రజలకు అవగాహనలో మంథని ట్రాన్స్ కో సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు

ముత్తారం,(విజయక్రాంతి): గృహ జ్యోతి పథకంతో  ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పిల్లల చదువులకు ఉపయోగించుకోవాలని మండలంలోని ఖమ్మంపల్లి, సీతంపేట, రామకృష్ణాపూర్ లలో  ప్రజలకు అవగాహనలో మంథని ట్రాన్స్ కో సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజా ప్రభుత్వం గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుందని, మీరు వాడిన బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థకు చెల్లిస్తుందని, విద్యుత్ బిల్లుల ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, మీ ఆరోగ్యం, కుటుంబా అవసరాలకు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 52. 82. 498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లులు ద్వారా లబ్ధి పొందారని, సుమారు మూడు కోట్ల 593 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపల్లి లైన్ మెన్ కుమారస్వామి, అసిస్టెంట్ లైన్ మెన్ రాజేష్, సిబ్బంది నాగరాజు నితిన్ తదితరులు పాల్గొన్నారు.