calender_icon.png 16 January, 2026 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైపాల్ రెడ్డి నివాళులర్పించిన సీఎం రేవంత్

16-01-2026 01:20:22 PM

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతి(Jaipal Reddy's birth anniversary) సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్ పీవీ మార్గ్‌లోని (నెక్లెస్ రోడ్‌) వారి స్మారక స్థలమైన స్ఫూర్తి స్థల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. రాజకీయాలకు విలువల విలువ తెలిపి ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పారని ఆయన సేవలను స్మరించుకున్నారు. జైపాల్ రెడ్డి స్వరాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియలో తన చాణక్య నీతి చూపారని కొనియాడారు. జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులున్నారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.