calender_icon.png 10 May, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలి

10-05-2025 03:40:13 PM

పుట్టపాకలో భూ నిర్వాసితులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని,(విజయక్రాంతి): జాతీయ రహదారి నిర్మాణంలో పెద్దపల్లి జిల్లాలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం మంథని మండలంలో పుట్టపాక గ్రామంలో భూ నిర్వాసితుల సమావేశంలో జిల్లా కలెక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ వరంగల్-మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సరైన పరిహారం అర్హతల ఆధారంగా  అందాలన్నారు. రైతులు అందించిన భూములలో ఉన్న బావులు, మోటార్, పైప్ లైన్, పండ్ల, అటవీ చెట్లు మొదలగు నిర్మాణాలకు పరిహారం సరిగ్గా అందలేదని నిర్వాసితులు  దరఖాస్తులు అందించారని కలెక్టర్ తెలిపారు.

నిర్వాసితులు అందించిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హతల ఆధారంగా  భూ సేకరణ జరిగే భూములలో ఉన్న నిర్మాణాలకు సరైన విలువ చూపిస్తూ ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు.భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమిలో ఉన్న ప్రతి నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని, అధికారులు అందించే నివేదిక ప్రకారం జాతీయ రహదారుల సంస్థకు ప్రతిపాదనలు పంపి నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో  ఆర్డీవో సురేష్, జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య, ఆర్ అండ్ బి, ఈ,ఈ భావ్ సింగ్, హార్టికల్చర్ జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి, తహ సిల్దార్ కుమారస్వామి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.