calender_icon.png 1 January, 2026 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రీట్ లైట్ లేక చీకట్లో దొంగల దారి దోపిడీ

30-12-2025 12:00:00 AM

భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కోలా రామకృష్ణ 

హనుమకొండ టౌన్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): వరంగల్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కు, మార్కెట్ వెళ్లే దారిలో కొత్త కరెంటు దీపాలను ఏర్పాటు చేయాలని భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కోల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ లో కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ కు వెళ్లే దారిలో రాత్రి వేళలో తగినంత వెలుతురు లేకపోవడం వల్ల పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాత్రి సమయంలో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పరిధిలోకి రావాలంటే ప్రమాదంకరంగా మారిందన్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల చీకటి ఎక్కువగా ఉండి దొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని, ప్రయాణించే ప్రజలను దౌర్జన్యంగా వెంబడించి వారిపై దాడి చేయడం డబ్బులు, జేబులో ఏముంటే అవి లాక్కోవడం వలన భయభ్రాంతులతో గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్హెచ్పి జిల్లా అధ్యక్షులు మడిపల్లి నాగరాజు గౌడ్, బీహెచ్పీ జిల్లా ఇన్చార్జి నాయిని వరుణ్ కుమార్, బిహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు మండ ప్రశాంత్, బోనగని శివకుమార్, కార్యవర్గ సభ్యులు ఆకుల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.