calender_icon.png 12 August, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

12-08-2025 12:56:23 AM

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ ఆగస్టు 11 : గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో ఉపాధి హామీ నిధులు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం, రెడ్లకుంట గ్రామంలో దాత గంగవరపు లక్ష్మణరావు స్థలంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ  కార్యాలయం,

నడిగూడెం మండల కేంద్రం లో పిఎసిఎస్ కార్యాలయ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోడౌన్లను సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోటి 11 లక్షల 76 వేల రూపాయలు విలువగల 312 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మండల పార్టీ అధ్యక్షులు తూమటి వరప్రసాద్ రెడ్డి, గంగవరపు లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య కనగల నాగేశ్వరావు అమర్నేని వెంకటేశ్వరరావు, మదన్, మల్లెల ప్రసాద్ మాజీ ఎంపీటీసీ లిక్కీ గురవమ్మ , పులిసులోచన రావు  ఉపేందర్,నందుల నరసింహశాస్త్రి పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.