12-08-2025 12:56:27 AM
- 108 చదరపు గజాల జెండా ఆవిష్కరణ
భీమదేవరపల్లి, ఆగస్టు 11: భారత వనికి స్వాతంత్య్రం సిద్ధించి 79 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత మాజీ ప్రధా ని, స్వర్గీయ పీవీ నరసింహారావు స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండ లం వంగరలోని బాలికల గురుకుల పాఠశాలలో 79 అడుగుల పొడవు గల స్తంభంపై 108 చదరపు గజాల జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
అందుకు ఏర్పాట్లు చేస్తు న్నామని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముల్కనూర్ పోలీస్ స్టేష న్‌లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 12 అడుగుల అడ్డం, 9 అడుగుల ఎత్తు గల జాతీయ జెండా పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.