04-02-2026 12:00:00 AM
మఠంపల్లి, ఫిబ్రవరి 3: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా,కాల్వపల్లి తండా గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది పర్యటించి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను సిబ్బంది సహాయంతో తొలగింపజేశారు.
ఈ సందర్భంగా ఏఈ హరీష్ రెడ్డి, సర్పంచ్లు బానోతు అరుణా దేశ్ పాండు నాయక్,మాలోతు సక్రు నాయక్ తో కలిసి మంగళవారం మాట్లాడుతూ వర్షాకాలం సమయంలో విద్యుత్ షాక్ గురై ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని,వర్షాలకు గోడలు తడిసినప్పుడు పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త పడాలన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలపై ఏఈ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,కార్యదర్శులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.