calender_icon.png 21 November, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకర్షణగా...టెర్రర్ ట్రీ..!

16-08-2024 01:24:23 PM

విషాన్ని వెదజల్లే చెట్టు

దీన్ని గాలి సోకితే డేంజర్ లో పడినట్టే

కోనో కార్పస్ చెట్లను తొలగించాలని గ్రామస్తుల డిమాండ్

(కోదాడ)16 విజయక్రాంతి: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న పల్లె ప్రకృతి వనంలో ఉన్న కోనో కార్పస్ చెట్లు సుమారు 40 అడుగుల ఎత్తు ఎదిగి పర్యావరణం మనవాళ్ళకి ప్రమాదకరంగా మారాయి. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతి వనంలో కోనో కార్పస్ చెట్లు విషపూరితమైన గాలిని ప్రజలు పీల్చడం వల్ల అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చెట్లు రహదారి వెంట ఉండడం వలన సింగారం గ్రామం నుండి కోదాడ వెళ్ళు మార్గమున గాలి, దుమ్ములకు బాటసారిల పైన, వాహనదారుల పైన, చెట్ల కొమ్మలు విరిగి పడతాయని జనం భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆకర్షణంగా ఉంటూ విషపూరితమైన గాలిని ఇస్తుంది

ఈ మొక్కలు అందంగా ఆకర్షణగా అతి త్వరగా ఎదగటం దీని లక్షణం. ఈ మొక్కల ద్వారా పుప్పొడి రేణువులు ఏర్పడి, గాలిని కలుషితం చేస్తాయి. శ్వాసకోస వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఈ మొక్కలు ఇప్పుడు ప్రజలు, జంతు క్రిమి, కీటకాల, ప్రాణాలను తోడ్పడేస్తున్నాయి. వెంటనే ఈ మొక్కలు గ్రామపంచాయతీ అధికారులు, వైద్యశాఖ అధికారులు, సమన్యాయంతో తొలగించాలని, అలాగే పర్యావరణ తోడ్పడే పూలు, పండ్లు, వేప, సితాఫలం, వంటి మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యం రక్షించాలని స్థానికులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విషపూరితమైన కోనో కార్పస్ చెట్లను తొలగించండి: గ్రామస్తుడు వెంకన్న

పల్లె ప్రకృతి వనంలో విరివిరిగా దర్శనమిస్తున్న కోనో కార్పస్ చెట్లను తొలగించాలని వాయిల సింగారం గ్రామానికి చెందిన వెంకన్న అధికారులను కోరారు. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ తిరిగి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కానీ కొన్ని మొక్కలు పర్యావరణం మానవాళికి ప్రమాదకరంగా మారాయి. అవే కోనో కార్పస్ చెట్లు వీటిని తొలగించి మంచి చెట్లు నాటాలని అధికారులను కోరారు.