7 August, 2026 | 2:31 AM

సివికా పౌల్ట్రీ ఫార్మ్ ఎదుట రెండో రోజుకు చేరిన గ్రామస్తుల ధర్నా

07-08-2026 01:21 AM

చేగుంట ఆగస్ట్ 6 (విజయక్రాంతి): చేగుంట మండలం పెద్ద శివనూర్ .గ్రామం లో గల సివికా పౌల్ట్రీ ఫార్మ్ వల్ల గ్రామం లో దుర్వాసన ఈగలు,పెరిగిపోయాయని పెద్ద శివునూర్ గ్రామస్తులు రెండో రోజు సర్పంచ్ నర్సింలు ఆధ్వర్యంలో పౌల్ట్రీ ఫార్మ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆందోళన కారులతో  మాట్లాడి , త్వరలోనే యజమాన్యం తో మాట్లాడి త్వరలోనే సమస్త పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు, అనంతరం సర్పంచ్ నర్సిములు మాట్లాడుతూ గ్రామ శివారులోని సీవీకే పౌల్ట్రీ ఫార్మ్ వల్ల గ్రామంలోకి దుర్వాసన రావడంతో పాటు గ్రామం మొత్తం ఈగలు వ్యాపిస్తున్నాయని. గత వర్షాకాలంలో సైతం గ్రామంలో విపరీతంగా ఈగలు పెరిగిపోయాయని పలువురు అనారోగ్యం బారిన పడ్డారని ఆరోపించారు.

వెంటనే పరిశ్రమ నిర్వాహకులు దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని లేదంటే పౌల్ట్రీ ఫార్మ్ ను మూసివేయాలని పేర్కొన్నారు. మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేయగా పౌల్ట్రీ ఫామ్ కు సంబంధించిన నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో రెండు రోజుల తర్వాత నిర్వాహకులు గ్రామస్తులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 

అనంతరం పంచాయతీ సెక్రెటరీ రాజు పౌల్ట్రీ ఫార్మ్ యజమానియానికి సంజాయిషీ కోరుతూ నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ మల్లేశం, శ్రీరాములు, బండ రాములు, రమేష్,నాయకులు సురేందర్, అప్పాల శేఖర్, ప్రశాంత్, తలారి అశోక్, యాదగిరి,నాగరాజు శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.