గ్రామ సభలో గందరగోళం
07-08-2026 01:23 AM
మనోహరాబాద్, ఆగస్ట్ 6 (విజయక్రాంతి): మనోహరాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో గురువారం గ్రామసభ ను సర్పంచ్ అనూష భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుచుండగా సభలో కాసేపు గందరగోళం నెలకొన్నది, ఒకరి పైన ఒకరు విమర్శల వర్షం గుప్పించుకున్నారు. అనంతరం సద్దుమణిగి గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలను, దీర్ఘకాలంగా ఏర్పడ్డ ఇబ్బందులను, అతి త్వరలో పరిష్కరించాల్సిందిగా గ్రామ పాలకవర్గం సభ్యులు కొందరు పేర్కొన్నారు. ఇందులో గ్రామ సెక్రెటరీ, పోలీస్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గన్నారు.






