22-07-2025 12:50:20 AM
కరీంనగర్, జూలై 21 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సోమవారం హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చిం చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. రాబోయే రోజు ల్లో కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరారు.
కరీంనగర్ అసెం బ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలు అత్యధికంగా విజయం సాధించేలా చేపట్టిన స్ట్రాటజీ, అదేవిధంగా కరీంనగర్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన పకడ్బందీ ప్రణాళికపై చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజ యం సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను వాడవాడనా, గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు రాజేం దర్ రావు తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటి కప్పుడు ఎండగట్టాలనీ, కాం గ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ మరింత అవగాహన కల్పించాలని సూచించారని రాజేందర్ రావుతెలిపారు.