03-11-2025 12:41:46 AM
వెల్దండ నవంబర్ 2మండలంలోని అజీలాపురం గ్రామం సమీపంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారిని ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా డబ్బు పోగుచేసుకుని రోడ్డు పునర్నిర్మాణం చేపట్టారు. మొంథా తుఫాను ప్రభావంతోడిండినార్లాపూర్ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణంతో కుందారం తండా, లాలుతండా రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయా యి.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గుణగంటి పెద్దయ్యగౌడ్, యాదయ్యగౌడ్, ఆనంద్ గౌడ్, శేఖర్ గౌడ్, లక్ష్మయ్య, మల్లేష్ గౌడ్, పలుస మల్లయ్య తదితరులు సొంతంగా ఖర్చులతో రహదారిని పునర్నిర్మించారు.