15-09-2025 02:30:47 PM
పాల్వాయి స్రవంతి..
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి(BRS Party State Leader Palvai Sravanthi) అన్నారు. నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మోగుదాల యాదగిరి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి సోమవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ గడ్డం మురళీధర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు లారీ బిక్షం, నాయకులు జక్కిడి యాదిరెడ్డి, రాసాల వెంకటేష్, రాచకొండ గిరి, చిలువేరు వెంకులు పాల్గొన్నారు.