calender_icon.png 15 September, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇట్ల ఉంది కాంగ్రెసోళ్ల కథ..: కేటీఆర్

15-09-2025 02:24:11 PM

హైదరాబాద్: 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలను చెల్లించామని.. పదేళ్లలో రూ. 20 వేల కోట్లు కూడా చెల్లించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) అన్నారు. తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సీఎంలు తీసుకువచ్చిన మంచి పథకాలను కేసీఆర్ కొనసాగించారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారని పేర్కొన్నారు. కళాశాలల బంద్ ఆపేలా బకాయిలు ఇచ్చి విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే కారణమని.. కాంగ్రెస్ నాయకులే యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.

మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్‌ మ్యాన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల దోపిడికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఒక గన్‌ మ్యాన్ లారీ లోడ్ యూరియా ఎత్తుకుపోతే ఇక కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఎంత దోచుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని.. ఇట్ల ఉంది కాంగ్రెసోళ్ల కథ అని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తుందని అన్నారు. నగరంలో చెత్త తీస్తలేరు.. లైట్లు వెలుగుతవలేవు.. గుంతలు పూడ్చుతలేరు అని, హైదరాబాద్ ను పట్టించుకునే నాధుడే లేడని పేర్కొన్నారు.