calender_icon.png 4 February, 2026 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలైలో విశ్వంభర!

04-02-2026 12:00:00 AM

అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. అయితే, ఈ భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చిరు ఇప్పుడు తాను నటించిన సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వంభర’ను వెండితెరపైకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిరుడు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల.. వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుదిదశకు చేరుకోవడంతో జూలై తొలి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా జూలై 9 లేదా 10న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో చిరంజీవి కూడా సానుకూలంగా స్పందిస్తూ, జూలైలో సినిమా వచ్చే అవకాశముందని ధ్రువీకరించటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ సుమారు రూ.75 కోట్ల వరకు కేవలం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.