7 August, 2026 | 2:31 AM

జిల్లాలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి పర్యటన

07-08-2026 12:38 AM

జనగామ, ఆగస్టు 6 (విజయక్రాంతి): గురువారం, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ముందుగా పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహిళా కమిషన్ ఛైర్పర్సన్కు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ క్రమంలో ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి స్వామివారిని దర్శించుకొని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, మహిళలందరికీ రక్షణ, సాధికారత, శ్రేయస్సు కలగాలని ప్రార్థించారు. తదనంతరం ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాముఖ్యత గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న, ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, తహసీల్దార్ సరస్వతి, వర్ధన్నపేట ఏసిపి నర్సయ్య, మహిళా కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు, పోలీసు అధికారులు,  తదితరులు పాల్గొని,  ఛైర్ పర్సన్‌కు పూలమొక్కలను అందజేసి, స్వాగతించారు.