22-05-2025 12:32:40 AM
-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి
ముషీరాబాద్, మే 21 (విజయ క్రాంతి) : దళితులను రెచ్చగొట్టి పబ్భం గడుపుకోడం వివేక్ కుటుంబానికి పరిపాటిగా మారిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి విమర్శించారు. పెద్దపల్లిలో పెద్ద అవమానం అని అనడానికి మాల మహానాడు నాయకులకు సిగ్గు ఉండాలని మండి పడ్డారు. ఎస్సీ వర్గీకరణ కాకుండా చేయడానికి వివేక్ చేస్తున్న డ్రామా అని విమర్శిం చారు.
బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల జేఎస్ చైర్మన్ గజ్జలకాంతంతో కలసి ఆయన మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద విజ యం అందించిన ఘనత ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘనతే అని పేర్కొన్నారు.
పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చినప్పటికీ గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిన ఘనత శ్రీధర్ బాబుకే దక్కుతుందన్నారు. గడ్డం వివేక్, వారి కుమారునికి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అబండాలు వేసి మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ధర్నాలు నిర్వహించడం సమంజసం కాదని అన్నారు. టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వారిపై నిరసన కార్యక్రమాలు చేయడం చూస్తే వివేక్ కుటుంబ సంస్కారం ఏంటో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.
ఎన్నికలప్పుడు శ్రీధర్ బాబు పెద్దపల్లిలో పెద్ద దిక్కు అయ్యారన్నారు. తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడని, అది మరిచిపోయి నోటికి వచ్చిన మాటలు మాట్లాడ టం సరికాదని అన్నారు. శ్రీధర్ బాబు దళిత వ్యతిరేకి అయితే, వంశీ కి 55 వేల మెజారిటీ ఎలా వస్తుందని ప్రశ్నించారు. దళిత జాతి అభ్యున్నతి కోసం చేసిన ఒక్క పని చెప్పని వివేక్ ను నిలదీశారు.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం వివేక్ కుటుంబానికి మాములే, వారు ఎక్కడ ఉన్నా అంతా నాశనమే అని మండిపడ్డారు. బిఎస్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, నాయకులు మీసాల మల్లే శం, బుధాల బాబురావు, లింగం యాదవ్, నక్క మహేష్, పాతకోటికరన్, డా.బొమ్మెర స్టాలిన్, వరలక్ష్మి, రవి కిరణ్, గుండి ప్రవీణ్, జోగు గణేష్, మీసాల మహేష్, దేవరకొండ నరేష్, గుర్రం కోటేష్, శేఖర్, ఎం.రమేష్ బాబు పాల్గొన్నారు.