22-05-2025 12:34:14 AM
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భారత పౌరుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోకుండా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై ఆరోపణలు చేయడం తగదన్నారు.
భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రధానిగా దేశానికే వన్నెతెచ్చిన మహానాయకుడు రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టారని తెలిపారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
పహల్గాం ఘటన నేపథ్యంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతీఒక్కరు గుర్తు తెచ్చుకున్నారని, తీవ్రవాదుల ముసుగులో దేశ పౌరు లపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం పేర్కొన్నారు. ‘మా దేశాన్ని మేం రక్షించుకోగలుగుతాం.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరమ్మ ఆనాడే స్పష్టం చేశారు.
కానీ ప్రస్తుతం పహల్గాం ఘటనలో పాకిస్థాన్ కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు వేశారు. మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్‌రెడ్డి, దుప్పటి కప్పుకొని పడు కున్నారు. మేం బయటకొచ్చి కేంద్రానికి అం డగా ఉ న్నామని ప్రకటించి, మద్దతు తెలి పాం. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి, ఇవాళ రాహుల్‌గాంధీని విమర్శి స్తున్నారు’ అని సీఎం మండిపడ్డారు.
సెక్రటే రియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేశారని, సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరి త్ర గాంధీ కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీదన్నారు. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో రాజకీయాలు చేయమని, దేశ భద్రతకు కట్టుబడి పనిచేస్తామని సీఎం తెలిపారు.
ఐటీ రంగానికి పునాదులు వేసింది రాజీవే
పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు
దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి రాజీవ్ గాంధీ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు అని కొనియాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. యువతకు 18 ఏండ్లకే ఓటు హక్కు, గ్రామ పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఘనత రాజీవ్‌గాంధీనన్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీర్ల ఐలయ్య, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు శివసేనారెడ్డి, మెట్టు సాయికుమార్, కార్పొరేటర్లు విజయారెడ్డి, శ్రీలత శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు మహాలక్ష్మి రామన్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, బొల్లు కిషన్, జగదీశ్వర్‌రావు, ఆది అవినాశ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.