calender_icon.png 12 January, 2026 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకం

12-01-2026 02:50:13 PM

ఉత్సవ సమితి అధ్యక్షులు రచ్చ శివకాంత్

బిచ్కుంద,(విజయక్రాంతి): వివేకానంద స్వామి 163వ జయంతి పురస్కరించుకొని సోమవారం బిచ్కుంద పట్టణంలో వివేకానంద స్వామి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు రచ్చ శివకాంత్ మాట్లాడుతూ... స్వామి వివేకానంద జీవితం యువతకు అందించిన ప్రేరణ, దేశాభివృద్ధిలో యువశక్తి పాత్ర గురించి, విద్యార్థులు, యువత స్వామి వివేకానంద ఆదర్శాలను అలవరుచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వివరించారు.ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ సమితి సభ్యులు వాసరేనాగనాథ్, ఉమాకాంత్, హనుమంత్ రావు, తపస్ బిచ్కుంద అధ్యక్షులు ముత్యాల సందీప్,  ప్రధాన కార్యదర్శి పేర్ శెట్టి శంకర్, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, పండరి, విద్యార్థులు పాల్గొన్నారు.