calender_icon.png 25 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వూట్కూరి వారి మానవతా సేవ!

25-01-2026 12:29:41 AM

ఆయన ‘మనమంతా శ్రీని వాసులం’ అనే స్ఫూర్తిదా యక నినాదంతో శ్రీనివాస్ అనే 28,000 మందికి పైగా వ్యక్తులను ఏకం చేసి, అసాధారణ మైలురా యిని సాధించారు. మానవతా సేవ, సామాజిక ఆవిష్కరణ, సామూహిక సామరస్యాన్ని చాటుతూ.. ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ (టీఎస్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి వూట్కూరిపై ప్రత్యేక కథనం.. 2025 అక్టోబర్ 26న, శ్రీనివాస ఫ్రెండ్స్ 2వ వార్షికోత్సవం సందర్భంగా, ఒక చారిత్రాత్మక ప్రపంచ రికార్డును సృష్టించింది.

ఇది అసమానమైన ఐక్యత, కరుణకు ప్రతీక. ఈ సంస్థ విశేషమైన కృషి చేసింది. వాటిలో 711 యూనిట్ల రక్తదానం అందులో 306 యూనిట్లు తలసేమియా బాధిత పిల్లలకు మద్దతు, అన్నదానం ద్వారా వేలాది మందికి సేవ లందిస్తున్నారు. చిరుధాన్యాల ఆధారిత భోజనాన్ని ప్రోత్సహించడం, 36,000 పెన్నులు పంపిణీ చేయడం, 200 మందికి పైగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం, కేకుకు బదులుగా భగవద్గీత, పుచ్చకాయ కోతతో పుట్టినరోజులను జరుపుకునే సాంస్కృతిక అభ్యాసాన్ని ప్రవేశపెట్టడం శ్రీనివాస్ సంకల్పానికి నిదర్శనం. ఈ అసాధారణ ప్రయత్నాలు మానవతా సేవ, సామాజిక ఆవిష్కరణ, సామూహిక సామరస్యం పట్ల టీఎస్‌ఎస్‌ఎస్ నిబద్ధతను హైలైట్ చేస్తాయి. అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సులోకి ప్రవేశించింది.

28 వాట్సాప్ గ్రూపులు.. 28 వేల శ్రీనివాసులు 

కలియుగ దైవం శ్రీనివాసుడి నామ ధ్యేయంతో శ్రీనివాసులు ఒక్కటి కావడం విశేషం. తిరుమల కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీనివాసుడిపై భక్తి విశ్వాసాలను పెంచుకున్న ఉమ్మడి రాష్ట్రంలోని ఆయన భక్తులు.. తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకుని వారిలో ఆ దేవదేవుడిని నిత్యం దర్శిస్తున్నారు కూడా. శ్రీనివాసులందరూ దైవకార్యాలతోపాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించడం గొప్ప సంకల్పం. తొలిసారిగా 2023 అక్టోబర్ 29న మన మంతా శ్రీనివాసులమే పేరుతో వుట్కూరి శ్రీనివాస్‌రెడ్డి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం 28 వాట్సాప్ గ్రూపుల్లో శ్రీనివాసుల సంఖ్య 28 వేలకు చేరింది. అక్టోబర్ 27 కరీంనగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో తొలివార్షికోత్సవం నిర్వహించగా.. 700 మం హాజరయ్యారు. ద్వితీయ వార్షికోత్సవం అక్టోబర్ 27, 2025లో జరుగగా శ్రీనివాసులు పెద్ద ఎత్తున హాజరు కావడంతోపాటు వండర్ బుక్ వరల్ రికార్డు సాధించారు.

 బల్మూరి విజయసింహరావు, విజయక్రాంతి, కరీంనగర్

పేరు ప్రాధాన్యం తెలపడానికి..

ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరికి శ్రీనివాస్ పేరు పెట్టేవారు. ప్రస్తుతం కొత్తకొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ పేరు ప్రాధాన్యాన్ని నేటితరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మన మంతా శ్రీనివాసులం అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాను. శ్రీనివాస్ పేరున్న అందరినీ ఒకటి చేస్తున్నా. ‘నమో శ్రీనివాసా’ పేరుతో చిన్నారుల నృత్య ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నా. 

 వూట్కూరి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షుడు