calender_icon.png 25 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

25-01-2026 12:30:06 AM

ఆహ్వానించిన జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధి నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మే రకు.. శనివారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబో యిన నరేష్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన వారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీలు కేవలం కొద్దిమంది పెత్తందార్ల చేతుల్లోనే ఉన్నాయన్నారు.

తమ సామాజిక వర్గాల అభివృద్ధి కేవలం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీతో నే సాధ్యమని తెలిపారు. జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సత్తా చాటుతామని తెలిపారు.   యూత్ జిల్లా అధ్య క్షులు మంద ది లీప్, యూత్ నియోజకవర్గ అధ్యక్షులు బో డా రమేష్ , పార్టీలో చేరిన వారు మ హ్మ ద్ యాకుబ్ పాషా బబ్బులు, జలీల్ పా షా, మహ్మద్ అస్లాం,అబ్దుల్ రహీం, రాజు, ల క్ష్మణ్, రాజేందర్  తదితరులు పాల్గొన్నారు.