calender_icon.png 20 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి

20-08-2025 01:05:13 AM

  1. ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి  
  2. ఉపరాష్ట్రపతిగా తెలుగువాడిని గెలిపించుకుందాం
  3. రాజకీయాలకు అతీతంగా సుదర్శన్‌రెడ్డి కోసం ఏకమవుదాం  
  4. ఎన్టీఆర్ లాగా రాజకీయ విజ్ఞతను ప్రదర్శించాలి 
  5. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కాదు 
  6. రాజ్యాంగ నిపుణుడు ఉపరాష్ట్రపతిగా ఉంటే దేశానికి మేలు 
  7.   21 తేదీన సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు 

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు తమ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాల ని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగాన్ని మార్చేవారికి, రాజ్యాంగాన్ని పరిరక్షిం చే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ఇండియా కూటమి ఉపరాష్ర్టపతి అ భ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజ ల గౌరవాన్ని పెంచిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

రాజకీయాలకు అతీతంగా వ్యవసా య కుటుంబంలో జన్మించిన తెలంగాణ బి డ్డ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణంగా ఉందని, ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉందన్నా రు. పీవీ నర్సింహారావు తర్వాత ఒక తెలుగువాడిని ఆ స్థాయిలో ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, బీజేపీ, బీఆర్‌ఎస్, వైసీపీ, ఎంఐఎం,  జనసేన పార్టీలతో పాటు కమ్యునిష్టు పార్టీలు కూడా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఉండి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్త మ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్, ఎ మ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మీడియాతో సీఎం రే వంత్‌రెడ్డి మాట్లాడారు.

ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షిం చేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపు ఉన్నా యని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్, జగ న్, అసదుద్దీన్ ఓవైసీ, పవన్ కళ్యాణ్, కమూ ్యనిస్ట్ సోదరులు, తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇ వ్వాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి.. 

1991 సంవత్సరంలో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీ గా పోటీ చేసినపుడు.. ఆనాడు ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టకుండా మద్దతు పలికి, రాజ కీయ విజ్ఞతను ప్రదర్శించారని సీఎం గుర్తు చేశారు. ఈనాడు ఒక తెలుగువాడు ఉపరాష్ర్టపతి అయ్యే అవకాశం వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలని, మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రా ల నుంచి 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని, మన మందరం ఏకతాటిపై వచ్చి సుదర్శన్‌రెడ్డిని గెలుపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

సుదర్శన్‌రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు

ఆ ఇంటి కాకి, ఈ ఇంటిపై .. ఈ ఇంటి కాకి .. ఆ ఇంటిపై వాలదని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీడియా గుర్తు చేయగా, సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదని, ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయనిపుణుడని, ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీకి చైర్మన్ అని తెలిపారు.

బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ఓబీసీ కదా? అని మీడియా ప్రశ్నించగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీకి సుదర్శన్‌రెడ్డినే చైర్మన్‌గా ఉన్నారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని సీఎం సమాధానమిచ్చారు. అంతేకాకుండా బీజేపీతో పాటు ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి రిజర్వేషన్లకు వ్యతిరేకమని, సుదర్శన్‌రెడ్డి రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి అని వివరించారు. రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఉంటే దేశానికి మంచిదన్నారు. 

తెలుగు, తమిళం మధ్య పోటీ కాదు 

ఉపరాష్ట్రపతి ఎన్నిక నార్త్ ఇండి యా, సౌత్ ఇండియా .. తెలంగాణ, తమిళనాడు మధ్య పోటీ కాదని సీ ఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగా న్ని మార్చేవారికి, రాజ్యాంగాన్ని పరిరక్షించే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ఎన్నికల్లో స భ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరా రు. సుదర్శన్‌రెడ్డి 21 తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.