9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

‘తప్పనిసరి ఓటింగ్’ కుదరదా?

15-05-2024 12:05 AM

‘ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే’. కుల, మత, వర్గ విచక్షణా లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు ఉంది. ఓటు మన ఆయుధం. అయితే, ఓటు వేయడం తప్పనిసరి కూడా కాదు. ‘ఓటు వేయండి’ అని చెప్పడం వరకే ‘ఎలక్షన్ కమిషన్’ బాధ్యత. ఓటు ఉండి వేయకపోతే ఎటు వంటి చర్యలు ఓటర్లపై ఉండవు. అది ఓటర్ల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా అలా కాదు. అక్కడ ఓటు కచ్చితంగా వేయాలి. ఇదొక నిబంధన. ఆ దేశంలో ఓటు అర్హత కలిగిన వారందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. లేకపోతే ఓటరు ఎందుకు ఓటు వేయలేదో సహేతుక కారణాలు చూపవలసి వస్తుంది. ముందు ఇటువంటి ‘ఖచ్చితమైన ఓటింగ్’ నిబంధన తెచ్చింది పశ్చిమ యూరప్‌కు చెందిన బెల్జియం దేశం. తర్వాతనే అర్జెంటీనా. అర్జెంటీనా దేశంలో క్రీ.శ. 1912 నుంచి ఓటు అర్హత ఉన్న ప్రతి వారు ‘విధిగా ఓటు వేయాల్సిందే’ అనే నిబంధన పెట్టారు. ఈ మేరకు చట్టం కూడ తెచ్చారు. అప్పటి నుంచి అక్కడ ఓటింగ్ తప్పని సరి అయింది.

స్పష్టమైన కారణాలు చెప్పాలి

అర్జెంటీనాలో మొదట్లో పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. తర్వాత మహిళలకు 1947 లో ఓటుహక్కును కల్పించారు. అక్కడ 16 నుంచి 18 ఏళ్ళ వయసు వారు కూడ ఓటు వేయవచ్చు. ఒకవేళ ఓటు కలిగిన వారు ఓటు వేయని పక్షంలో మూడు సంవత్సరాలపాటు నిర్దుష్ట పదవులలో ఉండరాదు. అర్జెంటీనాలో కొన్ని సంవత్సరాలపాటు నియంతగా పాలించిన ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ 1930 1976- సంవత్సరాలలో నియంతలు ఏలుబడిని సాగించారు. అందువల్ల అక్కడ అప్పుడు ఎన్నికలే లేవు. ఆ మేరకు ఏ ప్రజాస్వామిక నిబంధనలూ అమలు కాలేదు. తర్వాత క్రమేణా అర్జెంటీనాలో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడటంతో ఓటుహక్కు ఉన్నవారు ఓటు వేయని పక్షంలో వారు ఎందుకు వేయలేదో స్పష్టమైన కారణాలు చెపాలన్న నిబంధనలు విధించారు. ఆ దేశంలో 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళు కలిగిన వారు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఏవైనా కారణాలతో ఓటు వేయకపోతే శిక్షలు కూడా అక్కడ అమలులో ఉంటాయి. ‘ఓటు అర్హత ఉన్న ప్రతి వారు ఓటు వేయాలి’ అనే చట్టం మంచిదే. అయితే, కొన్ని సందర్భాలలో ఎన్నికల సమయంలో ఓటర్లు ఆయా ప్రాంతాలలో లేక పోయినా, వేరే ప్రదేశం కాని, దేశం కాని వెళ్ళినా వారికి ఓటు వేసే సౌలభ్యం ఉండదు. అటువంటి వారికి అర్జెంటీనా దేశం ఏమీ చెప్పలేదు. కాకపోతే, దేశంలో ఉండి ఓటు వేయకపోతే ఖచ్చితంగా అరవై రోజులలో కారణాలు చెప్పాలి. కారణాలు నమ్మే విధంగా ఉండాలి.  

చట్టమైతే ఉంది కానీ..

అయితే, అర్జెంటీనాలో ‘తప్పనిసరి ఓటింగ్’ నిబంధన అయితే ఉంది కాని అమలు పకడ్బందీగా జరుగుత్నుట్టు లేదు. చట్టం వున్నప్పటికీ దీనిని అక్కడి ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నట్టు విమర్శలు వున్నాయి. ‘తప్పనిసరి ఓటింగ్’ చట్టం అక్కడ పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడానికి ఏవేవో కారణాలు వున్నాయి. ఆశ్చర్యకరంగా దాదాపు 112 సంవత్సరాల నుంచీ ఆ దేశంలో ఈ చట్టమైతే ఉంది. 

 కనుమ ఎల్లారెడ్డి

సెల్ : 93915 23027