26-10-2025 12:56:25 AM
వరుణ్‌తేజ్ ఇప్పుడు తన 15వ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇటీవల ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ రితికా నాయక్ ఇందులో కథానాయిక నటిస్తోంది.
సత్య ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ‘వీటీ15’ అనే మేకింగ్ టైటిల్‌ల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకంగా మారుతుందని టీమ్ చెబుతోంది. హారర్ ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌లో యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌తో రానుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు మేజర్ షెడ్యూల్స్‌ను విదేశాల్లో పూర్తిచేశారు.
ఇండియాలోని పలు ప్రాంతాల్లోనూ చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కథానాయకుడు వరుణ్‌తేజ్‌తోపాటు ముఖ్యతారాగణం ఈ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ షెడ్యూల్‌లో చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్, థమన్ కాంబో ఈ సినిమాతో మరోసారి రానుంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌తో ప్రచార కార్యక్రమానికి తెర తీయనున్నారు.