calender_icon.png 26 October, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందమామ జోజో..

26-10-2025 12:55:09 AM

హీరో సుధీర్‌బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ  చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఉమేశ్‌కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్‌తోపాటు ప్రముఖ నటులు కనిపించనున్నారు.

నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుందీ సినిమా. తాజాగా మేకర్స్ ‘జో లాలి జో’ పాటను విడుదల చేశారు. ‘జో లాలి జో.. లాలి జో.. చందమామ జోజో.. వెన్నెలమ్మా జోజో.. బంగారు చిన్నారి జోజో.. నిదరోర మీ అమ్మ ఒడిలో..’ అంటూ సాగుతోందీ పాట. శ్రీమాన్ కీర్తి సాహిత్యం అందించగా, రాజీవ్‌రాజ్ ఈ పాటను స్వరపర్చడమే కాకుండా పావని వాసాతో కలిసి ఆలపించారు.