calender_icon.png 26 October, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవిని కలిసిన టీఎఫ్‌జేఏ నూతన కమిటీ

26-10-2025 12:57:32 AM

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) నూతన కమిటీ శనివారం అగ్ర నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పలు సహాయ కార్యక్రమాల గురించి మెగాస్టార్‌కు ఈ సందర్భంగా కమిటీ బాధ్యులు వివరించారు.

ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని, భవిష్యత్తులో హౌసింగ్ సొసైటీ, క్లబ్‌హౌస్ వంటివి ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్‌జేఏ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడాన్ని ఈ సందర్భంగా చిరంజీవి ప్రశంసించారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చిరంజీవి భరోసా ఇచ్చారు. మెగాస్టార్‌ను కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్రకుమార్ నాయుడు, ఇతర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.