calender_icon.png 11 September, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బోర్డు సీఈఓను వెంటనే నియమించాలి

11-09-2025 06:05:59 PM

మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓను వెంటనే నియమించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా(Minority Welfare Secretary Md. Yakub Pasha) గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం సీఈఓ గా విధులు నిర్వహిస్తున్న అసదుల్లాను తొలగించి నెల గడిచిందని అయినప్పటికీ, ప్రభుత్వం నేటి వరకు నూతన సీఈఓ ను నియమించలేదని, దీని కారణంగా వక్ఫ్ బోర్డులో పాలన గాడి తప్పుతుందని అన్నారు. వక్ఫ్ భూముల కబ్జాదారుల ఫిర్యాదులు జీతాభత్యాలు, పెన్షన్లు, ఇమాం, మౌజన్ ల గౌరవ వేతనాల వంటి పలు పరిపాలనా అంశాలు స్తంభించిపోయినాయని, సీఈఓ లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వస్తున్న ఫిర్యాదుదారులు వెనుతిరిగి వెళ్లవలసి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వక్ఫ్ బోర్డు సీఈఓ గా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే వక్ఫ్ బోర్డ్ పాలన గాడినపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.