11-09-2025 08:23:09 PM
ఆపస్మారక స్థితిలో ఉన్న రైతుకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నరేష్
హుజూర్ నగర్: యూరియా కోసం పిఎసిఎస్ వద్దకు వెళ్లిన పట్టణంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన కుడితొట్టి స్వామి(65) అపస్మారక స్థితిలో పడిపోగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ నరేష్(Police Constable Naresh) రైతును గమనించి అప్రమత్తమై వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నరేష్ ను పలువురు రైతులు, అధికారులు అభినందించారు. ఇటీవల జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి పోలీసు సిబ్బంది సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండేలా గతంలోని శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా యూరియా కోసం వెళ్లిన రైతును సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నరేష్ ను హుజూర్ నగర్ సిఐ చరమందరాజు, ఎస్ఐ మోహన్ బాబుతో పాటు పలువురు సోషల్ మీడియాలో ప్రశంసించారు.