calender_icon.png 11 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైస్తవ మైనారిటీల సమస్యల పరిష్కారం కోసం సహకారం అందిస్తుంది

11-09-2025 08:08:13 PM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల: క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా  సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో  తెలంగాణ క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ప్రత్యేకంగా స్మశాన వాటికకు భూకేటాయింపు, చర్చిల నిర్మాణపు అనుమతులు, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, క్రైస్తవ మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ, తదితర అంశాలపై పాస్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్రైస్తవ మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం  ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని  చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

క్రైస్తవుల అత్యధిక జనాభా ఉన్న గ్రామాల జాబితా ఆధారంగా, ప్రభుత్వ స్థలాలలో స్మశాన వాటికలను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మ్యారేజ్ లైసెన్సులు జారీకి వచ్చిన దరఖాస్తులను జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం బిసి-సి కుల ధ్రువీకరణ పత్రాలను విచారణ జరిపి అందించడం జరుగుతుందని అన్నారు. కమ్యూనిటీ హాల్ లను ఎంపీ/ఎమ్మెల్యే నిధులతో మంజూరు  చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. చర్చిల రిజిస్ట్రేషన్ కొరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కృష్ణానది వద్ద క్రైస్తవులకు ప్రత్యేక స్నానాల ఘట్టాన్ని ఏర్పాటుకు పరిశీలించడం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ నిబంధనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని నుషిత, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.