11-09-2025 06:02:27 PM
గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్..
రేగొండ (విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతరలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో నవంబర్ మాసంలో జరిగే జాతర వరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) ఆశీస్సులతో అన్ని పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్ అన్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ. 2 కోట్లతో స్వామివారి కొండపైకి ఎక్కే భక్తుల కోసం మెట్ల వెడల్పు, కోనేరు, నీటి గుండం, లను వెడల్పు చేసే వంటి అభివృద్ధి పనులపై శంకుస్థాపనలు చేయగా గురువారం నుండి కాంట్రాక్టర్ లు పనులు ప్రారంభించారు. ముందుగా మెట్ల వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసేట్టుగా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తేదారు లక్కం రాములు,సూర బాపురావు, తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, నాయకులు పల్నాటి శ్రీను, సిద్ధ సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.