calender_icon.png 11 September, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి

11-09-2025 08:27:34 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్..

గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను గ్రామాలలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో  ఉపాధి హామీ పనుల జాతర-2025 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని, అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు మండల వారీగా,గ్రామ పంచాయతీ వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాలకు వెళ్లి కూలీలను చైతన్యవంతం చేసి ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు.

జిల్లాలో కొత్తగా 29 గ్రామ పంచాయతీ భవనాలు, 29 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు ఏ ఏ గ్రామాల్లో,ఏ ఏజెన్సీ ద్వారా చేపట్టాలో స్పష్టంగా నిర్ణయించాలని,ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ గ్రామాన్ని ఎంపిక చేసి పనులు చేపట్టాలని అన్నారు. నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు.అంగన్వాడీ కేంద్రాలను పిల్లల సంక్షేమం దృష్ట్యా విశాలమైన ప్రదేశంలో,తగిన గాలి, మంచి వెలుతురు ఉండేలా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.జిల్లాలో ఎంపికచేసిన పాఠశాలల్లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని  ఆదేశించారు.పశువుల పాకలు, మేకల పాకలు, అజోల్లా యూనిట్లు, చెక్ డ్యాంలు,పౌల్ట్రీ షెడ్స్, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,డిపిఓ నాగేంద్రం, పంచాయతీ రాజ్ ఈ.ఈ దామోదర్ రావు,జిల్లా సంక్షేమ అధికారి సునంద,ఎంపిడిఒలు, డి.ఈలు,ఎ.ఈలు,తదితరులు పాల్గొన్నారు.