11-09-2025 06:08:50 PM
తిమ్మాపూర్ (విజయక్రాంతి): విమోచన దినోత్సవం సందర్బంగా ప్రతీ బూత్ లో జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, సేవా పక్వాడ్ జిల్లా కన్వీనర్ ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో గురువారం మండల కార్యశాల ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా కన్వీనర్ మాట్లాడుతూ, సేవా పక్వాడ్ సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమాల విషయం పార్టీ సూచనలను తప్పకుండా పాటించాలని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని పేర్కొన్నారు. సేవా పక్వాడ్ కార్యక్రమాల పరంగా రక్తదానాలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించే విదంగా కార్యకర్తలు రూపకల్పన చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి నరహరి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, మండల కన్వీనర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, కో కన్వీనర్ ఎర్రోజు లక్ష్మణ్, కార్యకర్తలు బుర్ర శ్రీనివాస్ గౌడ్,జంగ సునీల్ రెడ్డి,గడ్డం శ్రీనివాస్ రెడ్డి,కామెర వెంకటేష్,మేకల అనిల్,తమ్మనివేణి మహేష్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.