calender_icon.png 11 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పాలనాధికారులకు నియామక పత్రాల అందజేత..

11-09-2025 08:10:28 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ 

గద్వాల (విజయక్రాంతి): రెవెన్యూ శాఖలో ఎంపికైన  గ్రామ పాలనాధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(District Collector B.M. Santosh) నియామక పత్రాలను అందజేశారు. గురువారం ఐడిఓసి కలెక్టర్ చాంబర్‌ నందు గ్రామ పాలనాధికారుల నియామక పత్రాలు కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీవోల నియామకాలను చేపట్టినట్లు తెలిపారు.భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో, నిబద్ధతతో న్యాయబద్ధంగా పని చేయాలని గ్రామ పరిపాలన అధికారులకు సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పర్యవేక్షణ.. తదితర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ సమర్థవంతంగా పర్యవేక్షించాలన్నారు. గ్రామీణస్థాయిలో అన్ని ధ్రువీకరణపత్రాల విచారణ సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ఎంపికలో నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా వ్యవహరించడమే కాక, గ్రామస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా కూడా జీపీవోలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,ఎ.ఓ. భూపాల్ రెడ్డి, గ్రామ పరిపాలన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.