03-05-2025 12:00:00 AM
ఏ ప్రయోజనం లేనిదే అమెరికా పెద్దరికానికి పోదు. ఉక్రెయిన్ విషయంలోనూ అదే జరిగింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు పాల్పడింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉ న్న జో బైడెన్ మేమున్నామంటూ ఉక్రెయిన్‌కు సైనిక సంపత్తిని అందించా రు. దాని విలువ 120 బిలియన్ డాలర్లు. యుద్ధంలో కూరుకుపోయిన ఉ క్రెయిన్ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. భవిష్యత్‌లో చెల్లించే పరిస్థితి కూడా లేదు.
తాము అందించిన మిలిటరీ సాయానికి పరిహారం చెల్లిం చాలని అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చింది. 120 బిలియన్ డా లర్లకు దాదాపు నాలుగింతలుగా 500 బిలియన్ కోట్ల డాలర్లు పరిహారం గా చెల్లించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగేసి చెప్పారు. లేదంటే ఉక్రెయిన్‌లో వున్న అపారమైన, అరుదైన, విలువైన ఖనిజ సంపదపై ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ ప్రభుత్వం సందేశమిచ్చింది.
ఆ వి షయం చర్చించి ఒక ఒప్పందం కుదుర్చుకొని అమెరికా సాయం కొనసాగేలా చూడాలనుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలినెస్కీ శ్వేత సౌధానికి వచ్చా రు. కొద్దినెలల క్రితం జరిగిన పర్యటనలో యుద్ధం ముగించి, రష్యాకు దా సోహమవ్వాలన్నట్టుగా సాగిన ట్రంప్ మాటలు జెలినెస్కీకి నచ్చలేదు. మిలిటరీ సాయానికి బదులుగా, పరిహారంగా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకో వాలనే అంశం వెనుకబడి ఆ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
అయితే, అమెరికా చెపుతోన్న పరిహారం చెల్లించి, ఉక్రెయిన్‌లోని పది తరాల తలలను అమెరికాకు తాకట్టు పెట్టలేమని జెలినెస్కో స్పష్టం చేశారు. ఏమైతేనేం, అమెరికా తలపెట్టింది సాధించింది. వాషింగ్టన్, కీవ్ మధ్య ఖనిజాల వెలికితీతపై ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన ఖనిజాలను తవ్వి తీసేందుకు అమెరికా పెట్టుబడి పెడుతుంది.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్భంగా వాటికన్లో చిత్రవిచిత్రంగా కనిపించిన ట్రంప్, సంద ర్భోచితం కాకపోయినా ఈ ఒప్పందంపై జెలినెస్కీతో ఏకాంతంగా చర్చించి తన మాట నెగ్గించుకున్నారు. జెలినెస్కీపై వైట్‌హౌస్‌లో శ్రుతిమించి వ్యవహరించిన ట్రంప్, యుద్ధం పరిసమాప్తి చేసి క్రెడిట్ తీసుకోవాలనుకున్న తన ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గండి కొడతారని ఊహించి ఉండరు.
యుద్ధంలో ఇప్పటి వరకు తనదే పైచేయి అని భావిస్తున్న పుతిన్, అమెరికా మాట ఎందుకు వింటారు? కీవ్‌పై గతవారం భయంకరంగా క్షి పణి దాడి చేసినప్పుడు, ‘వ్లాదిమర్, ఆపు’ అని సోషల్ మీడియాలో అరిచినంత పని చేశారు. ట్రంప్ అనుకున్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరుగలేదు. పుతిన్‌పై పెరిగిన అసహనంతో ట్రంప్ ఇక అమెరి కా దారి అమెరికాది అనే ఆలోచనకు వచ్చి ఉక్రెయిన్‌తో ఒప్పందానికి సి ద్ధపడ్డారు. ఖనిజ ఒప్పందం ఉక్రెయిన్‌లోని పరిశ్రమల ఆధునీకరణకు ఉపయోగకరమని జెలినెస్కీ చెప్పుకున్నారు.
యూరోపియన్ యూనియన్ గు ర్తించిన 34 అరుదైన లోహాల్లో 22 లోహాల నిల్వలు ఉక్రెయిన్‌లో వున్నా యి. బ్యాటరీలు, సిరామిక్స్కు వాడే లీథియం ఉక్రెయిన్‌లో పుష్కలం. బుధవారం రెండు దేశాలమధ్య జరిగిన ఒప్పందంపై రష్యా మౌనం పాటించిం దనే చెప్పాలి.
రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇది ఉక్రెయిన్‌కు శరాఘాతమేనని వ్యాఖ్యానించారు. ఒప్పందంలో కీవ్ పాలకుల నడ్డిని ట్రంప్ విరిచే శాడని ఆయన భావన. మిలిటరీ సాయానికి పరిహారంగా అమెరికాకు కీవ్ పాలకులు భారీ మూల్యంగా ఖనిజ సంపదను చెల్లించుకోవాల్సి వస్తున్నది.