04-08-2025 01:31:50 AM
కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ సాయిఫణిచంద్ర
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): మనిషి దృఢంగా ఉండా లంటే ఎముకలు బలంగా ఉండాలి. జాతీ య ఎముక, జాయింట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎముకల ఆరోగ్యం గురించి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ సలహాదారు ఆర్థోపెడిక్, ఆర్త్రోస్కోపీ, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బి సాయిఫణిచంద్ర వివరించారు. “చాలామందికి తెలియ ని ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుచేసుకోవాలి.
అదే నీటి ప్రాముఖ్యత. ఎముకలు జీవించగల గుట్టు గల కణాలు. వాటిలో సుమారు 25శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి కొరత వస్తే, ఎముకలు గట్టిప డిపోతాయి. అవే సులభంగా పగిలే ప్రమా దం ఉంటుంది. నీరు తగినంత తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి కొత్త శక్తిని ఇస్తుంది. నీరు కాల్షియం శోషణ, శరీరమంతా పంపిణీకి అవసరం. జాయింట్ ఆరో గ్యం, నీరు లేకుండా జాయింట్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవం తక్కువవుతుంది.
ఫలితంగా కీళ్ల నొప్పులు, గట్టితనం, అధిక రాసిపోడం జరుగుతుంది. నీటి కొరత వల్ల కండరాల మూర్చలు, జాయింట్ నొప్పులు, అలసట, గట్టితనం వస్తుంది. రోజంతా నీటి ని ఎక్కువగా తాగడం, తురష, దోసకాయ, బత్తాయి వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, టీ, కాఫీలు, మద్యం తగ్గిం చడం, వేసవి కాలంలో మరియు వ్యాయా మ సమయంలో నీరు ఎక్కువ తాగడం మంచింది. తగినంత నీరు తాగటం ద్వారా ఆస్టియోపోరోసిస్, జాయింట్ నొప్పులు వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు” అని చెప్పారు.