16-08-2025 01:44:21 PM
నంగునూరు: గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నంగునూరు మండలం గుండా వెళ్లే మోయటుమ్మెద వాగు(Moya Tummeda Vagu) పరవళ్లు తొక్కుతోంది. దీంతో పరిసర ప్రాంతాలలో పండుగ వాతావరణం నెలకొంది.వాగు ఉధృతంగా ప్రవహించడంతో దానిపై నిర్మించిన ఆరు ప్రధాన చెక్ డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ఖాతా, ఘనపూర్, అక్కనపల్లి, నంగునూరు, సిద్ధనపేట గ్రామాల్లోని ఈ చెక్ డ్యామ్‌లు జలకళను సంతరించుకుంది.పూర్తిగా నిండిన చెక్ డ్యామ్‌లు ఈ ప్రాంతంలోని వ్యవసాయానికి, భూగర్భ జలాల పెంపునకు ఎంతగానో దోహదపడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అందాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.