calender_icon.png 16 August, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నెపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటు

16-08-2025 02:20:52 PM

యువకునికి స్వల్ప గాయాలు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి మండల(Kannepalli Mandal) కేంద్రంలో శనివారం కురిసిన భారీ వర్షానికి పిడుగుపడింది. కొట్రంగి మహేష్ అనే యువకుడి ఇంటి ఆవరణలో ఒక్కసారిగా పిడుగుపడడంతో అక్కడే ఉన్న మహేష్ స్పృహ తప్పి కిందపడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి అతని చేతికి బొబ్బలు రావడం గమనించాడు. మహేష్ తృటిలో పిడుగుపాటు నుండి తప్పించుకోవడం పట్ల అతని కుటుంబ సభ్యులు ఊపిరిపించుకున్నారు.