calender_icon.png 4 October, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

04-10-2025 05:10:19 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాత్రి 7 గంటల వరకు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని, అలాగే ఈనెల 8వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, హబ్సిగూడ, నాగోల్, బండ్లగూడ, తట్టి అన్నారం సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.