calender_icon.png 3 May, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ షెడ్లు వ్యవసాయానికి లాభసాటి

16-04-2025 12:00:00 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ): వ్యవసాయ రంగంలో అత్యంత లాభసాటిగా వాటర్ షెడ్లు రైతులకు ఉపయోగపడతాయని నాగర్ కర్నూల్ అదనప కలెక్టర్ దేవ సహాయం అన్నారు.  మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో వాటర్ షెడ్ యాత్రపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.

ప్రధానమంత్రి కృషి  సంచాయి యోజన పథకంలో భాగంగా ఈనెల 23న వాటర్ షెడ్ యాత్రను అమ్రాబాద్,  ఉప్పునుంతల బికే లక్ష్మాపూర్ గ్రామాలలో చేపట్టనున్నట్లు తెలిపారు. వాటర్ షెడ్లు నీటి వనరులకు, పర్యావరణానికి కీలకమైనవని,వాటిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు.

భూ సంరక్షణ, నీటి సంరక్షణ, గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగు కొరకు ఉద్దేశించిన వ్యవసాయ సంబంధమైన పండ్ల తోటల పెంపకం, అధునాతన సాంకేతిక వ్యవసాయ పద్ధతి ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ప్రజల్లో విస్తృత అవగాహన పెంచలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి చిన్న ఓబులేసు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్, సంబంధిత శాఖల అధికారులు,పాల్గొన్నారు.