20-09-2025 02:58:22 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాలలో ప్రతీ నెల 3వ శనివారం తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరంలో సుమారు 80% అటెండెన్స్ తో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ముఖ్యపాత్ర పోషించాలన్నారు. నెలలో ప్రతీ 3వ శనివారం పాఠశాలకు వచ్చి విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల ప్రగతిని గురించి చర్చించారు.