20-09-2025 02:52:47 PM
అదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)ను కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకురాలు, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత కలిశారు. ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా సుజాత-ఆశన్న దంపతులు శనివారం హైదరాబాదులో డిప్యూటీ సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పాటుపడాలన్నారు.