20-09-2025 02:43:02 PM
తెలంగాణ సంస్కృతికి నిలయంగా బతుకమ్మ పండుగ
ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): విద్యార్థినిలు ఎంతటి లక్ష్యాన్ని ఆయన సులువుగా చేదించగలరని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నగర ఎన్ఏస్యు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన బతుకమ్మ పండుగ సంబరాలకు ఎమ్మెల్యే నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణిక రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉందన్నారు.
రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎమ్సెస్సి ఎంట్రెన్స్ టెస్ట్ టెస్ట్ లో టాప్ రెండు ర్యాంకులు మన కళాశాలకు వచ్చాయని ప్రిన్సిపాల్ చెప్పగానే ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీరు అనుకుంటే ఎంతటి లక్ష్యాన్ని అయిన చేరుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు తెచ్చిన ర్యాంకుల వలన మీ వలన ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల పాటు మన మహబూబ్ నగర్ ప్రతిష్ట మరింత పెంచారని ఆయన చెప్పారు. ఐదు అదనపు తరగతి గదులను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబం తో ఆనందంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, అలాగే సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎదగాలనే సంకల్పం గట్టిగా ఉంటే ఆ స్థాయికి సులువుగా చేరుకుంటారని పేర్కొన్నారు.
చదివే తర్వాత మారుస్తుంది
ప్రతి విద్యార్థి తలరాత చదివే మారుస్తుందని నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణిక రెడ్డి అన్నారు. మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. మిమ్మల్ని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి ఆమె అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, వచ్చే సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలకు వస్తానని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో వారం రోజుల పాటు జరిగిన ఓరియంటేషన్ శిక్షణ పొందిన విద్యార్థులకు నారాయణ పేట ఎమ్మెల్యేతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు జాజి మొగ్గ నర్సింహులు, ఖాజా పాషా, ఉమర్, ఎన్ఎస్యుఐ నరేష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ముకుందం రమేష్, ముకుందం రమేష్ లీడర్ రఘు, అర్షద్ , శ్యాం, అలీం, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనురాధ, అమినా ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.